మంచు లక్ష్మి పోస్టర్ పై రామ్ గోపాల్ వర్మ సంచలన ట్వీట్

-

టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు… రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆర్జివి కి ఉన్న ఫాలోయింగ్ మరెవ్వరికీ లేదు. ఎప్పుడూ ఏదో ఒక విషయంపై.. ట్వీట్ చేస్తూ ట్రెండింగ్లో ఉంటారు రాంగోపాల్ వర్మ. అయితే తాజాగా మంచు లక్ష్మి పోస్టర్ పై కామెంట్ చేశారు రామ్ గోపాల్ వర్మ. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా తెరకెక్కుతున్న మాన్ స్టార్ అనే సినిమాలో మంచు లక్ష్మి ఓ పాత్ర లో కనిపించనుంది. దీనికి సంబంధించిన ఓ పోస్టర్ ను మంచు లక్ష్మి తన ట్విట్టర్లో పెట్టుకుంది.

అయితే ఈ ఫోటో పై రామ్ గోపాల్ వర్మ కామెంట్ చేశారు. మంచు లక్ష్మి ఫోటోను ట్యాగ్ చేస్తూ… “ఈమె ఎవరో గెస్ చేయండి” ? అంటూ ట్వీట్ చేశాడు వర్మ. ఆ ట్వీట్ చేసిన కొద్ది క్షణాల్లోనే మరో ట్వీట్ చేసి.. మంచు లక్ష్మీ పై పొగడ్తల వర్షం కురిపించాడు వర్మ. “నువ్వు చేయలేని పని ఏదైనా అసలు ఉందా? నా కళ్ళను నేనే నమ్మలేక పోతూ న్నాను” అంటూ రామ్ గోపాల్ వర్మ పేర్కొన్నారు. అయితే రామ్ గోపాల్ వర్మ ట్వీట్ పై మంచు లక్ష్మి కూడా స్పందించింది. “ఒక ఆర్టిస్ట్ గా నేను చేయలేనిది ఏదీ లేదు అందుకే ఈ క్యారెక్టర్ చేస్తున్నాను” అంటూ బదులిచ్చింది మంచు లక్ష్మి.

Read more RELATED
Recommended to you

Latest news