ప్రపంచంలో అన్ని దేశాల్లో వ్యవస్థలు తమ పౌరుల ప్రయోజనాల కోసం చూడటం లేదు. ప్రజల అవసరాలను తీర్చేందుకు లంచం లేనిదే ఏ పని కూడా చేయడం లేదు. రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు అవినీతి కుంభకోణాల్లో ఇరుకుంటున్నారు. ప్రపంచంలో పలు దేశాల్లో అవినీతిని అంచానా వేయడానికి ట్రాస్పరెన్సీ ఆర్గనైజేషన్ వివిధ దేశాలకు ర్యాంకులు కేటాయించింది. 2020 CPI (జనవరి 2021న విడుదలైంది) 0 నుండి 100 వరకు స్కేల్‌లో 180 దేశాలకు ర్యాంక్ ఇచ్చింది. స్కోర్ ఎంత తక్కువగా ఉంటే, దేశం అంత అవినీతిగా పరిగణించబడుతుంది. ఈ జాబితాలో ఇండియా 180 దేశాల్లో 86 వ స్థానంలో నిలచింది. 100 స్కోర్ కు కేవలం 40 స్కోరును సాధించింది. ఆసియా దేశాలు పాకిస్థాన్, శ్రీలంకలు మన కన్నా దిగువ స్థానల్లో ఉన్నాయి.
ప్రపంచంలో అవినీతి తక్కువగా ఉన్న దేశాలు
న్యూజిలాండ్, డెన్మార్క్ , ఫిన్లాండ్, సింగపూర్, స్వీడన్, స్విట్జర్లాండ్, నార్వే, నెదర్లాండ్స్,జర్మనీ, లక్సెంబర్గ్, ఆస్ట్రేలియా.
ప్రపంచంలో అవినీతి ఎక్కువగా ఉన్న దేశాలు
సోమాలియా, సౌత్ సూడాన్, సిరియా, వెనుజులా, యోమెన్, గినియా, లిబియా, కాంగో, హైతీ, నార్త్ కొరియా,