కరోనా కారణంగా మూసిఉన్న థియేటర్లు సంక్రాంతికి సందడి చేసేలా కనబడుతున్నాయి. సంక్రాంతి అంటేనే సినిమా పండగ. మరి ఆ సినిమా పండగ ఈ కరోనా టైమ్ లో ఎలా జరగనుందనేది ఆసక్తికరంగా ఉంది. ఇప్పటికైతే మల్టీప్లెక్సులు ఓపెన్ అయ్యాయి. యాభై శాతం సీటింగ్ సామర్థ్యంతోనే నడుస్తున్నాయి. మరి సంక్రాంతికైనా వంద శాతం సీటింగ్ సామర్థ్యానికి ప్రభుత్వం నుండి అనుమతులు లభిస్తాయా లేదా అన్నది ఇంకా తేలలేదు.
అదలా ఉంటే, ఇటు చిత్ర నిర్మాతలు సంక్రాంతికి సినిమాలని రెడీ చేస్తున్నారు. రవితేజ హీరోగా నటించిన క్రాక్ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల అవుతుంది. ఇందులో రవితేజ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన పాటలు మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఐతే ప్రస్తుతం క్రాక్ కి పోటీగా రామ్ పోతినేని రెడ్ కూడా రిలీజ్ అవుతుంది. ఈ మేరకు చిత్రబృందం అధికారిక ప్రకటన చేసింది. రెడ్ కూడా మాస్ మసాలా చిత్రమే. మరి రెండు మాస్ సినిమాలు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ప్రేక్షకులు ఎలాంటి రెస్పాన్స్ అందిస్తారో చూడాలి.