చలికాలంలో గొంతునొప్పి నుండి ఉపశమనం పొందండిలా..

-

చలికాలం వచ్చిందంటే చాలు శ్వాసకోస సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. జలుబు, గొంతునొప్పి అందులో ముఖ్యమైనవి. ఐతే చలికాలంలో గొంతు నొప్పి ఇబ్బంది పెడుతుంటే దాన్నుండి ఉపశమనం పొందడానికి కొన్ని చిట్కాలని ఈరోజు తెలుసుకుందాం. దీని కోసం మన కిచెన్ లో పదార్థాలే ఉపయోగపడతాయి.

కొంచెం పసుపు, కొంచెం ఉప్పు తీసుకుని నీళ్లలో పోసి గోరు వెచ్చగా అయ్యేంత వరకూ స్టవ్ మీదే ఉంచాలి. ఆ తర్వాత ఆ నీటిని నోట్లో పోసుకుని పుక్కిలించి ఉమ్మివేయాలి. ఇలా ఒక నాలుగు సార్లు చేయాలి.

ఉసిరికాయ రసం

కొద్దిపాటి ఉసిరికాయ రసాన్ని తీసుకుని దానికి తేనె కలిపి రెండుసార్లు తాగాలి.

మెంతులు

ఒక టేబులు స్పూన్ మెంతులు తీసుకుని, 250మిల్లీ లీటర్ల నీళ్ళలో ఉడికించాలి. ఆ తర్వాత వడకట్టి ఆ నీటిని తాగాలి.

దాల్చిన చెక్క

ఒక టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పౌడర్ గానీ లేక దాల్చిన చెక్క తీసుకుని 250మిల్లీ లీటర్ల నీటిలో ఐదు నిమిషాల పాటు మరిగించాలి. గోరు వెచ్చగా కాగానే దానికి కొంచెం తేనే, నిమ్మరసం కలుపుకుని తాగాలి.

తులసి

నాలుగు లేదా ఐదు ఆకుల తులసి తీసుకుని నీళ్ళలో వేడిచేయాలి. ఆ తర్వాత దానికి తేనె లేదా అల్లం కలుపుకుని తాగవచ్చు.

పసుపు పాలు

గోరువెచ్చని పాలల్లో పసుపు కలుపుకుని రాత్రిపూట తాగి పడుకుంటే చాలా చక్కగా పనిచేస్తుంది. దానికి నల్ల మిరియాలు కలుపుకుంటే ఇంకా మంచి ఫలితం ఉంటుంది.

నిమ్మరసం

గోరువెచ్చని నీళ్ళు తీసుకుని దానికి నిమ్మరసంతో పాటు తేనె కలుపుకుంటే గొంతునొప్పి త్వరగా తగ్గిపోతుంది.

Read more RELATED
Recommended to you

Latest news