తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారుల పనితీరుపై టీటీడీ గౌరవ ప్రధాన అర్చకులైన రమణ దీక్షితులు ఒకింత ఆగ్రహం వ్యక్తపరిచారు. ఆయన ట్విట్టర్ వేదికగా తన సందేశాన్ని తెలియజేశారు. గత రెండు రోజుల నుండి వెంకన్న స్వామికి నిత్యం సేవలు అందచేసే పూజారులకు కరోనా పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో ఆయన ఈ విధంగా స్పందించారు.
స్వామి వారికి నిత్యం కైంకర్యాలు చేసే 50 మంది ప్రధానార్చకులలో, ఏకంగా 15 మంది అర్చకులకు కరోనా పాజిటివ్ రావడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తోందని ఆయన తెలియజేశారు. అంతే కాకుండా మరో 25 మంది అర్చకులకు కూడా కరోనా పరీక్ష ఫలితాలు రావాల్సి ఉందని తెలిపారు. వీటితో పాటు రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో స్వామివారి దర్శనానికి వచ్చే ప్రజల్ని నిలిపి వేయకపోవడం దారుణమని ఆయన టిడిపి పై విరుచుకుపడ్డారు. అందులో ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో తో పాటు అదనపు ఈవో ల వ్యవహారశైలి అర్చకులకు వ్యతిరేకంగా ఉన్నాయని తెలియజేశారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ని ట్యాగ్ చేసి తెలిపారు.
@ysjagan @Swamy39 CBN has illegally unconstitutionally retired 20+ hereditary archakas. Hon high court ordered TTD to take us back. Jagan promised to take us back. But TTD EO and AEO still obeying CBN and refusing to implement court orders and Jagan’s instructions. We still wait.
— Ramana Dikshitulu (@DrDikshitulu) July 11, 2020