వైజాగ్ ప్రమాదం వెనుక కుట్ర… వెలుగులోకి వైజాగ్ ఫైర్ బ్రాండ్!

-

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు క్షణక్షణం మారిపోతున్నాయి. ఈరోజు ఇప్పుడు ఉన్న పరిస్థితులు మరికాసేపటికి లేకుండా నిరంతంరం మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా రాజధాని విషయం అధికార వైసీపీల మధ్య పంతాలు పట్టింపులు తీవ్రంగా చోటుచేసుకుంటున్నాయి. అమరావతి నుంచి అంగుళం కూడా రాజధాని కదలలేదు అని ప్రతిపక్ష టీడీపీతో పాటు, చోటామోటా బీజేపీ కండువాలు కప్పుకున్న నేతలు కూడా మాటల ద్వారా ప్రజలు బెట్టింగులు కాచుకొనేంతగా… పార్టీ క్యాడర్ కు మరోసారి అవకాశాలు కల్పించేస్తున్నారు. ఇలా రాజకీయం రసవత్తరంగా సాగుతుంది.

అయితే తాజాగా అధికార పార్టీ రాజధాని వైజాగ్ అని చెప్పగానే.. వరుసగా ప్రమాదాలు చోటుచేసుకోడవంతో అధికార పార్టీ అనుమానాలను వ్యక్తం చేస్తుంది. తాజాగా విశాఖ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బ తీసేందుకు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పావులు కదుపుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ మండిపడ్డారు. విశాఖలో ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదం వెనుక కుట్ర దాగి ఉందని ఆయన అనుమానాన్ని లేవనెత్తారు. తన అనుమానాలను నిజం చేసేలా చంద్రబాబు స్పందించారని… విశాఖను రాజధానిగా చేయాలన్న ప్రభుత్వ యత్నాన్ని అడ్డుకొనేందుకు ఆయన వైజాగ్ ప్రజల్లో భయాందోళనలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని స్పష్టం చేశారు.

అయితే తాజాగా అమర్‌నాథ్‌ మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్రంలోని 13 జిల్లాలను 25 జిల్లాలుగా పెంచాలన్న కేబినెట్‌ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు సీఎం జగన్‌ కృషి చేస్తున్నారని.. ఆయన రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజలకోసం తీవ్రంగా కష్టపడుతున్నారని.. చంద్రబాబు మాత్రం రియల్ ఎస్టేట్ గురించే ఆలోచిస్తారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే ఓర్వలేక బురద జల్లుతున్నారని పైర్ అయ్యారు. ద్రబాబు ఓ బ్యాక్‌డోర్‌ పొలిటీషియన్‌ అని.. విశాఖ ఫార్మా కంపెనీల ప్రమాదంపై ఆయన స్పందించిన తీరు అనుమానాలకు తావిస్తోందని అమర్ నాథ్ స్పష్టం చేయడం ఇప్పుడు వైజాగ్ వాసులకు కొత్త ఆలోచనలు రేపుతున్నట్లైంది.

Read more RELATED
Recommended to you

Latest news