Get ready : ఇవాళ రాత్రి 8 గంటలకు “రామారావు ఆన్ డ్యూటీ” ట్రైలర్

-

టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ హీరోగా తెరకెక్కుతున్న తాజా సినిమా “రామారావు ఆన్ డ్యూటీ”. శరత్ మండవ దర్శకుడిగా ఈ సినిమాతో పరిచయం అవుతున్నారు. ఈ సినిమాను s.l.v. సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగా… దివ్యాంక కౌశిక్, రజిషా విజయన్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఇక ఈ సినిమాలో వేణు తొట్టెంపూడి కీలక పాత్రలో కనువిందు చేయనున్నారు. యదార్థ సంఘటన ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ సినిమా ట్రైలర్ ఇవాళ విడుదల కానుంది. ఇవాళ సాయంత్రం 8.01 గంటలకు ఈ మూవీ ట్రైలర్ విడుదల కానుంది. కాగా… ఈ సినిమా జూలై 29 వ తేదీన అన్ని థియేటర్లలో విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news