కేసీఆర్‌ ఫామ్ హౌస్‌కి రండి చూపిస్తా.. హరీష్ రావు సవాల్‌

-

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు కొనసాగుతున్నాయి. నేడు బడ్జెట్‌పై సాధారణ చర్చ జరుగుతోంది. అయితే.. ఈ నేటి సమావేశాల్లో ప్రసంగించిన ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌ రావు కేంద్రంపై విమర్శలు గుప్పించారు. కేంద్రం ప్రభుత్వం రాష్ట్రానికి సక్రమంగా నిధులు విడుదల చేస్తే అభివృద్దిలో రాష్ట్రం మరింత ముందంజలో ఉండేదన్నారు హరీష్ రావు. కేంద్రం నుండి రాష్ట్రానికి రూ. 1.27 లక్షల కోట్లు రావాల్సి ఉందన్నారు హరీష్ రావు . ఈ నిధులను ఇప్పించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ఆయన బీజేపీ నేతలను కోరారు. రాష్ట్రానికో రూల్ ను కేంద్రం అమలు చేస్తుందన్నారు హరీష్ రావు. కేంద్ర ప్రభుత్వం సెస్ ల రూపంలో తమ ఖజానాను నింపుకుంటుందన్నారు. 21 శాతం సెస్ ల రూపంలో కేంద్రం ఆదాయం సమకూర్చుకుుందని హరీష్ రావు తెలిపారు.

పన్నుల్లో 41 శాతం వాటాను కేంద్ర ప్రభుత్వం ఇస్తే రూ. 44, 400 కోట్లు రాష్ట్రానికి దక్కేదన్నారు. కానీ , కేవలం 30 శాతం మాత్రమే కేంద్రం రాష్ట్రానికి ఇస్తుందన్నారు. అంతేకాకుండా.. ఫామ్ హౌస్ లో తాంత్రిక పూజలు చేస్తారని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని.. కేసీఆర్‌ ఫామ్ హౌస్ కి రండి చూపిస్తా అంటూ ఆయన ధ్వజమెత్తారు. ఫామ్ హౌస్‌లో కపిల గోవుకు కేసీఆర్ పూజలు చేస్తారని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో యూనివర్సిటీలో తాంత్రిక, చేతబడి కోర్సులు పెట్టారని, తంత్రాలు అయిన కుతంత్రాలైన బీజేపీకే సాధ్యమని హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు కవులు అయ్యారని క అంటే కనపడదు.. వి అంటే వినపడదు అంటూ హరీష్‌ రావు ఎద్దేవా చేశారు. నీతి అయోగ్ ప్రశంసించినా రాష్ట్రంలో విపక్షాలకు కనపడదు…వినపడదని ఆయన వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news