కరోనా ఎవరినీ వదిలిపెట్టడం లేదు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ…. చిన్న చిన్న లీడర్ల నుంచి ఉపరాష్ట్రపతి వరకు… అంతా కరోనా బారినపడుతున్నారు. అన్‌లాక్ మొదలైనప్పటినీ నుంచి కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ వచ్చింది. కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులకు కరోనా సోకింది. పలువురు ప్రజాప్రతినిధుల ప్రాణాలను సైతం బలితీసుకుంది మహమ్మారి. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్రమంత్రులు అమిత్‌షా, గడ్కరీ, గుజరాత్ సీఎం విజయ్ రూపానీ, కర్నాటక సీఎం యడియూరప్ప ఇలా ఎవరూ కరోనాకు అతీతం కాదని తేలిపోయింది.
వీరంతా కరోనా బారినపడ్డవారే. వీరితో పాటు ఇంకా చాలా మంది కేంద్ర మంత్రులకి కరోనా సోకింది. రోజూ ఇద్దరు ముగ్గురు వీఐపీలు కరోనా బారిన పడుతూనే ఉన్నారు. తాజాగా ఈరోజు కేంద్ర మంత్రి రామ్ దాస్ అధవాలే కరోనా బారిన పడ్డారని తెలుస్తోంది. ఆయనకు ఈరోజు కరోనా లక్షానాలు కనిపించడంతో టెస్ట్ చేయించుకున్నారు. దీంతో ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఇక తాజాగా ఆయన పార్టీ అయిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాలో హీరోయిన్ పాయల్ ఘోష్ చేరింది. రాందాస్ అథవాలే సమక్షంలోనే ఆమె పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.