ఈనాడు గ్రూపుల అధినేత రామోజీరావు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందా..ప్రస్తుతం వెంటిలేటర్ ఫై చికిత్స అందిస్తున్నారా ? ఇదే ఇప్పుడు మీడియా వర్గాల్లోనూ, సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. వాస్తవానికి ఇప్పటికే వయోఃభారంతో ఉన్న రామోజీరావు రెండేళ్లుగా తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. పలుమార్లు ఆయన వైద్యం చేయించుకుంటున్నారు. కొన్ని నెలలుగా తరచూ ఆసుపత్రిలోనే ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే మరోసారి ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వస్తోన్న వార్తలు ఆయన అభిమానులతో పాటు ప్రతి ఒక్కరిలోనూ ఆందోళన కలిగిస్తున్నాయి.
దీనిపై ఈనాడు వర్గాల నుంచి గాని… రామోజీ కుటుంబం నుంచి గాని ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు. రామోజీరావు ఎంత వయస్సు మీద పడినా యాక్టివ్‌గానే ఉంటుంటారు. రామోజీ గ్రూప్‌లో ఉన్న కంపెనీల వ్యవహారాలన్నింటినీ ఇప్పటికీ రామోజీరావే చూసుకుంటున్నారు. పెద్దకొడుకు కిరణ్, కోడలు శైలజ వ్యాపారవ్యవహారాల్లో చురుగ్గా ఉన్నప్పటికీ.. పర్యవేక్షణ మాత్రం రామోజీరావుదే.
అంతెందుకు ఆయన మానసపుత్రిక అయిన ఈనాడు వ్యవహారాలను, ఈనాడు పత్రిక నిర్వహణలో ఇప్పటకీ ఆయన సలహాలు ఇవ్వడంతో పాటు కీలకంగా వ్యవహరిస్తుంటారు. ఏదేమైనా తెలుగు మీడియా రంగంలో ఆయన చేసిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. ఈ వయస్సులోనూ తన సంస్థల నిర్వహణతో పాటు మీడియా రంగంలో ఆయనకు ఉన్న తపన ఎప్పటకీ మెచ్చుకోదగ్గదే. రామోజీ నిజంగా అనారోగ్యంతో ఉంటే ఆయన వెంటనే కోలుకుని మళ్లీ యాక్టివ్ అవ్వాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు.