విజయశాంతి అంటే పవర్‌ఫుల్ లేడీ లీడర్. సినిమాల్లో ఎలాగైతే లేడీ సూపర్‌స్టార్గా పేరు తెచ్చుకున్నారో రాజకీయాల్లో కూడా సివంగిలా దూసుకుపోతుండేవారు. తనదైన పంచ్ డైలాగులతో పవర్‌ఫుల్ స్పీచులు ఇచ్చేవారు. కానీ ఎప్పుడైతే బీజేపీలో చేరారో అప్పటి నుంచి అసలు బయట పెద్దగా కనిపించట్లేదు. కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు ప్రెస్‌మీట్లు పెట్టి మాట్లాడేవారు.
కేసీఆర్‌పై పబ్లిక్ మీటింగుల్లో పాల్గొని మరీ తిట్టేవారు. తనదైన స్టైల్‌లో ప్రతిపక్ష నాయకులను విమర్శించేవారు. కానీ ఈ మధ్య అసలు బయట మాట్లాడటం పూర్తిగా మానేసారు. అసలు ఆమెకు ఏమైందంటూ ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
అయితే బీజేపీలో ఆమెకు పెద్దగా గుర్తింపు ఇవ్వట్లేదా అనే అనుమానం తలెత్తుతోంది. బీజేపీలో ఏదైనా బండి సంజయ్, కిషన్‌రెడ్డి, ధర్మపురి అరవింద్, రఘునందన్‌రావు వరకే పరిమితమవుతోంది. ఏదైనా వారే నిర్ణయాలు తీసుకుంటున్నారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఫాలోయింగ్ ఉన్న విజయశాంతిని ఎందుకు అస్త్రంగా ఉపయోగించట్లేదనేది అర్థం కావట్లేదు. ఆమె మాత్రం కేవలం ట్విట్టర్‌లోనే కేసీఆర్‌పై విమర్శలు చేస్తున్నారు. మరి కొవిడ్ ఉందని బయటకు రావట్లేదా లేదా ఇంకేదైనా కారణమా వేచిచూడాలి.