రఘురామ విషయంలో ఏపీ సర్కార్ కి షాక్

-

వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటే రఘురామ తనయుడు భరత్ వేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్ట్ విచారణ వాయిదా వేసింది. రఘురామను పోలీసులు కొట్టారంటూ చేసిన ఆరోపణలపై.. సీబీఐ విచారణ కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు… విచారణ ఆరు వారాల పాటు వాయిదా వేసింది.

ప్రతివాదుల జాబితా నుంచి ఏపీ ప్రభుత్వం, జగన్‌, సీఐడీ తొలగించారు. కేంద్ర ప్రభుత్వం, సీబీఐ మాత్రమే కేసులో ప్రతివాదులు అని స్పష్టం చేసారు. ప్రతివాదుల జాబితా నుంచి ఏపీ ప్రభుత్వాన్ని తొలగించడంపై న్యాయవాది దవే అభ్యంతరం వ్యక్తం చేసారు. దవే అభ్యంతరాలను పట్టించుకోని ధర్మాసనం… 6 వారాల్లోగా సమాధానం చెప్పాలని నోటీసులు ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news