త్వరలోనే స్ట్రీమింగ్ కానున్న ‘రానా నాయుడు’ సీజన్ 2

-

వెంకటేశ్ – రానా ప్రధానమైన పాత్రలను పోషించిన ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ ఇటీవల నెట్ ఫ్లిక్స్ ఫ్లాట్ ఫామ్ పైకి వచ్చింది. కరణ్ అన్షుమాన్ దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ కి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. వెంకటేశ్ కి ఇది తొలి వెబ్ సిరీస్ కావడం వలన కూడా ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే ఇందులో బూతుల గోల ఎక్కువగా ఉండటంతో తెలుగులో ఈ సిరీస్‌కు పెద్దగా ఆదరణ లభించలేదు. పైగా బూతు పదాల పట్ల విమర్శలు రావడంతో ‘రానా నాయుడు’ తెలుగు వెర్షన్‌ను స్ట్రీమింగ్ నుంచి తొలగించింది నెట్‌ఫ్లిక్స్ . ఇదిలా ఉంటే, తాజాగా ఈ సిరీస్ సెకండ్ సీజన్ గురించి అధికారికంగా ప్రకటించడం విశేషం.

Rana Nayudu Season 2

సీజన్ 2 ను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తున్నట్టుగా నెట్ ఫ్లిక్స్ వారు ఒక ప్రకటన చేశారు. అందుకు సంబంధించిన వీడియోను కూడా వదిలారు. ఇందులో సుచిత్రా పిళ్లై, గౌరవ్ చోప్రా, సుర్వీన్ చావ్లా ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఇక ‘రానా నాయుడు’ అనేది ప్రముఖ అమెరికన్ టీవీ సిరీస్ ‘రే డోనోవన్’కు ఇండియన్ అడాప్టేషన్‌గా తెరకెక్కింది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news