దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో అలియా భట్ రామ్ చరణ్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటు బాలీవుడ్ చిత్రపరిశ్రమలో అలియా భట్ వరుస చిత్రాల్లో నటిస్తూ మంచి బిజీగా ఉం
ది. గల్లీ బాయ్ హిట్ తరువాత ఆమె బ్రహ్మాస్త్ర, కళాంక్ వంటి భారీ సినిమాల్లో నటిస్తోంది. అయితే ఆలియా భట్, రణ్‌బీర్‌తో ప్రేమలో ఉన్నట్టు, తర్వలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నట్టు ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది.
వాస్తవానికి ఆలియా తనకు చిన్నప్పటి నుంచి రణ్‌బీర్ అంటే ఇష్టమని ఎన్నో సందర్భాల్లో వెల్లడించారు. అలాగే పార్టీలకు ఫంక్షన్స్‌కు ఇద్దరూ కలిసే వెళ్తుంటురు. తాజాగా ముకేష్ అంబానీ ఇంట్లో జరిగిన వినాయక చవితి వేడుకల్లో కూడా ఇద్దరూ కలిసి సందడి చేశారు. ప్రస్తుతం వీరిద్దరూ `బ్రహ్మస్త్ర` చిత్రంలో నటిస్తున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం డిసెంబర్‌లో విడుదల కానుంది.
అయితే ఇటీవల జరుగుతున్న ప్రచారం ప్రకారం బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, రణ్‌బీర్ కపూర్‌ల ఎంగేజ్మెంట్ వచ్చే నెలలో ఫిక్స్ అయిందట. ఈ క్రమంలోనే 2020లో వీరి వివాహం జరగనున్నట్టు సమాచారం. వాస్తవానికి రణ్‌బీర్ తండ్రి రిషీ కపూర్ అనారోగ్య కారణాల వల్ల నిశ్చితార్థం లేట్ అయిందని అంటున్నారు. ప్రస్తుతం ఆయన కోలుకున్నారట. ఈ క్రమంలోనే వీరిద్దరూ ఎగేజ్మెంట్ చేసుకోవాలి నిశ్చయించుకున్నారట. మరి ఈ ప్రచారం ఎంత వరకు నిజం అనే దానిపై వీరిద్దరూ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు.