Rangamarthanda: ‘రంగమార్తాండ’ లేటెస్ట్ అప్‌డేట్..ఈ సారి సక్సెస్ గ్యారెంటీ అంటున్న కృష్ణవంశీ

-

టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రంగ మార్తాండ’ సినిమా కోసం అభిమానులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. సంగీత దిగ్గజం ఇళయరాజా ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి ఆయన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కంప్లీట్ చేసినట్లు డైరెక్టర్ కృష్ణవంశీ తెలిపారు.

ట్విట్టర్ వేదికగా సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ ను ఎప్పటికప్పుడు కృష్ణవంశీ ఇస్తున్నారు.
పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలో ఈ చిత్ర లోగోతో పాటు ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నారని సమాచారం.

మరాఠి సూపర్ హిట్ ఫిల్మ్ ‘నట సామ్రాట్’ చిత్రానికి అఫీషియల్ తెలుగు రీమేక్ గా వస్తున్న ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ద్వారా కృష్ణ వంశీ డెఫినెట్ గా బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుని ఫామ్ లోకి వస్తారని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. డైరెక్టర్ కృష్ణవంశీ సైతం ఈ సినిమాపైన చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారని టాక్.

Read more RELATED
Recommended to you

Latest news