పార్లమెంట్ ఎన్నికల్లో కూడా నన్ను ఆశీర్వదించండి మీ రుణం తీర్చుకుంటానని చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి హామీ ఇచ్చారు. తాండూరు మున్సిపల్ పరిధిలో సీతారాంపేట గుమస్తా నగర్ వాసవి కాలనీ తో పాటుగా పలు ప్రాంతాల్లో ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తో కలిసి ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించారు.
ఇచ్చిన హామీలు అమలు చేసిన హామీలు ని వివరించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి తమ వంతు కృషి గా నేతలు అందరూ కలిసికట్టుగా ఇంటింటి ప్రచారం చేస్తున్నారు ఆరు గ్యారెంటీ పథకాలని ప్రతి గడపకి తీసుకెళ్లడానికి కార్యకర్తలు కష్టపడాలని సూచించారు.