7 నెలల పసిపాపపై దారుణం.. గుంటూరు జిల్లాలో కలకలం

గుంటూరు: మాచర్ల మండలం బోదనంపాడులో దారుణ ఘటన జరిగింది. 7 నెలల పసిపాపపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఇంటి ముందు తల్లి పక్కన నిద్రపోతున్న పాపను దుండగులు తీసుకెళ్లారు. తల్లి నిద్ర లేచే సరికి పాప కనిపించలేదు. దీంతో కంగారు పడిన తల్లి చుట్టుపక్కల అంతా వెతికారు. అయితే బహిర్బూమికి వెళ్లిన గ్రామస్తులకు పసి పాప రోడ్డు‌పై కనిపించింది. పాప పేదాలు, మర్మాంగాలపై గాయాలు ఉన్నట్లు గుర్తించారు. పాపను గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. పాపకు వైద్యం అందిస్తున్నారు. ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్థానిక సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. నిందితుడు గ్రామానికి చెందిన వ్యక్తి అయి ఉంటారని అనుమానిస్తున్నారు. బాధిత కుటుంబానికి చెందిన వారికి కూడా విచారించారు. అనుమానం వ్యక్తులను కూడా పిలిపించి విచారణ జరిపారు. మరోవైపు గ్రామస్తులు ఆగ్రమం వ్యక్తం చేశారు. నిందతులను త్వరగా గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

 

జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న పసికందును జిల్లా సంయుక్త కలెక్టర్‌ ప్రశాంతి చూసి తల్లిని పరామర్శించారు. చిన్నారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఏడు నెలల పాపపై జరిగిన ఈ ఘటన జిల్లాలో సంచలనం సృష్టించింది.