తప్పెవరిది – నొప్పెవరికి: గిల్లితే గిల్లించుకోవాలంటున్న రాపాక!

-

పవన్ సహనానికి కూడా ఒక హద్దుంది! అది బాధ్యత అని ఫీలయినప్పుడు మాత్రమే తెలుస్తుంది! రాపాక ఓపెన్ గా చెప్పడానికి కూడా ఒక లిమిట్ ఉంది! ఇంతకన్నా ఏమిచెప్పాలి అనే ఆయన వాదనకూ అర్ధం ఉంది! ప్రస్తుతం ఈ డిస్కషన్స్ జరుగుతున్నది.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ – జనసేన వన్ అండ్ ఓన్లీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్!

“ఆయన గెలిచింది నావల్ల కాదుకదా .. అంతా ఆయన ఇష్టం” అని పవన్.. రాపాకను వదిలేశారో.. లేక, “ఎప్పుడూ అసెంబ్లీలో అడుగుపెట్టని నాయకుడికి ఫార్మాలిటీల గురించి ఏమి చెబుతాం” అని రాపాక.. పవన్ గురించి లైట్ తీసుకున్నారో తెలియదు కానీ.. వీరిద్దరూ ఒకరికొకరు సంబంధం లేకుండా నడుచుకుంటున్నారు!

ఇప్పటికే పవన్ కు ఎక్కడో మండే పనులు ఎన్నో చేసిన రాపాక.. తాను ఏమి చేసినా “పవన్ ప్రశ్నించలేరు” అనే నమ్మకంతో జనసేన వన్ అండ్ ఓన్లీ ఎమ్మెల్య్యే రాపాక వరప్రసాద్.. ఆంధ్రప్రదేశ్‌ నూతన మంత్రులుగా ప్రమాణం చేసిన సీదిరి అప్పలరాజు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణలను ప్రత్యేకంగా కలిసి అభినందించారు. ఇదేమీ పెద్ద బ్లండర్ కాకపోయినా… తన పార్టీకంటూ ప్రత్యేక విధివిధానాలు, విప్ లు ఇచ్చే ధమ్ములూ లేకపోవడంతో… తనకు అనిపించిందల్లా చేసుకుంటూపోతూ.. వైకాపాకు మరింత దగ్గరవుతున్నారు వరప్రసాద్!

ఇక్కడ గమనించాల్సినవి రెండు విషయాలు! రాపాక వరప్రసాద్ రూపంలో.. అధినేత రెండుచోట్ల ఓదిపోయినా కూడా అసెంబ్లీలో తమ పార్టీ స్వరం వినిపించే అవకాశం, అదృష్టం దక్కిందన్న విషయాన్ని గ్రహించకుండా, రాకాపకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వకుండా.. పవన్ లైట్ తీసుకోవడం!! పవన్ లైట్ తీసుకున్న విషయాలపై హర్ట్ అయిన రాపాక… పవన్ ను హర్ట్ చేయప్రయత్నించడం! అయితే.. ఈ విషయంలో తప్పంతా పవన్ దే అంటున్నారు విశ్లేషకులు!

ఉన్న ఒక్క ఎమ్మెల్యేని అయినా జాగ్రత్తగా కాపాడుకుంటూ.. రేపు కొత్తగా పార్టీలోకి రాబోయే వారికి మరింత ధైర్యాన్ని, భరోసాని కల్పించే సంకేతాలు ఇవ్వాల్సిన పవన్… తాను గెలిస్తేనే అది గెలుపు, పార్టీలో మరెవరు గెలిచినా అది “లైట్” అన్నట్లుగా ఉంటే ఎలాగ అనేది విశ్లేషకుల ప్రశ్న! ఎన్నికల్లో పోటీచేసిన మొదటిసారే వందకు పైగా సీట్లు రావాలని కోరుకోవడం, రాని అనంతరం పార్టీ సిద్ధాంతాలను పక్కనపెట్టి… విలీనం చేయడం, పొత్తులు పెట్టుకోవడం వంటి పనులు చేయడం వల్ల… ప్రజలకు ఎలాంటి సంకేతాలు ఇస్తున్నరో ఆపనులు చేసినవారికే తెలియాలని వారు సూచిస్తున్నారు!

Read more RELATED
Recommended to you

Latest news