Adil Durrani : రాఖీ సావంత్ భ‌ర్తపై రేప్ కేసు 

-

బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ రాఖీ సావంత్ భర్త అదిల్ దుర్రానీపై రేప్ కేసు నమోదైంది. మైసూరులో అత‌నిపై ఆ కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. ఇరాన్‌కు చెందిన విద్యార్ధిని చేసిన ఆరోపణలతో ప్‌, చీటింగ్‌, బ్లాక్‌మెయిలింగ్‌ ఆరోపణల కింద కేసు నమోదు చేసినట్లు వీవీ పురం పోలీసులు వెల్లడించారు.

ఫార్మ‌సీ చ‌ద‌వేందుకు ఇరాన్ నుంచి ఓ అమ్మాయి మైసూరుకు వ‌చ్చింది. ఐదేళ్ల నుంచి ఆమె ఇక్క‌డే విద్య‌ను కొన‌సాగిస్తోంది. పెళ్లి చేసుకుంటాన‌ని చెప్పి ఆ యువ‌తిని రేప్ చేసిన‌ట్లు పోలీసులు దుర్రానీపై కేసు న‌మోదు చేశారు. పెళ్లి చేసుకుంటాడ‌న్న ఉద్దేశంతో దుర్రానీతో శ‌ారీర‌కంగా దగ్గ‌రైన‌ట్లు ఆ యువ‌తి త‌న ఫిర్యాదులో పేర్కొంది. ఐదేళ్ల నుంచి పెళ్లి చేసుకునేందుకు అనిల్ నిరాక‌రించిన‌ట్లు ఆమె చెప్పింది.

అదిల్ దుర్రానీపై భార్య రాఖీ సావంత్ కూడా కేసు బుక్ చేయ‌డంతో అత‌న్ని అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే. త‌న ఫండ్స్‌ను దుర్వినియోగం చేసిన‌ట్లు అదిల్‌పై రాఖీ పోలీసు ఫిర్యాదులో పేర్కొంది

Read more RELATED
Recommended to you

Latest news