సెల్ ఫోన్ల వల్లే అత్యాచారాలు… బీజేపీ హోం మంత్రి సంచలన వ్యాఖ్యలు

-

సెల్ ఫోన్లు అత్యాచారాలకు కారణం అవతున్నాయంటూ … సంచలన వ్యాఖ్యలు చేశారు గుజరాత్ హోం మంత్రి హర్ష్ సంఘవి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సెన్సెషన్ అయ్యాయి. ప్రస్తుతం సెల్ ఫోన్లలో పోర్న్ వీడియోలు సులభంగా వచ్చేస్తున్నాయని ఆయన అన్నారు. ఇవి అత్యాచారాలకు కారణం అవుతున్నాయంటూ వ్యాఖ్యానించారు. మనకు తెలిసిన వ్యక్తులు, ఇరుగుపోరుగు, కుటుంబ సభ్యులు కూడా ఇందులో ఉండవచ్చని ఆయన అన్నారు. 

ఇలాంటి సంఘటనలు సమాజంలో కళంకం తీసుకువస్తాయని హర్ష్ సంఘవి అన్నారు. ఇటీవల నిర్వహించిన సర్వేలో అత్యాచారాలకు మొబైల్ ఫోన్లు, సన్నిహితంగా కారణమని తేలిందని ఆయన తెలిపారు. అత్యాచార ఘటనల్లో పోలీసులను ఎప్పుడూ నిందిస్తుంటారని… ఈ ఘటనలకు పోలీసు మాత్రమే కారణం కాదని ఆయన అన్నారు. తండ్రి తన కూతురుపై అత్యాచారానికి పాల్పడితే దానికి కారణం పోలీసులది కాదని.. అతని చేతిలోని మొబైల్ ఫోన్ దే అని హర్ష్ సంఘ్వీ అన్నారు. గుజరాత్ దేశంలో కెల్లా సురక్షితమైనదని ఆయన పేర్కొన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news