ఐఏఎఫ్ అధికారిణిపై అత్యాచారం…”రెండు వేళ్ల ప‌రీక్ష”తో మ‌రో దారుణం..!

-

శిక్షణలో ఉన్న ఐఏఎఫ్ అధికారినిపై సహోద్యోగి అత్యాచారానికి పాల్పడటం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఢిల్లీకి చెందిన ఓ మహిళ కోయంబత్తూర్ రెడ్ ఫీల్డ్ ఎయిర్ ఫోర్స్ ట్రైనింగ్ కాలేజీ లో కొన్ని నెలలుగా శిక్షణ పొందుతోంది. ఈ క్రమంలో సెప్టెంబర్ 10వ తేదీన క్రీడా శిక్షణ సమయంలో ఆమె గాయపడ్డారు. దాంతో తన గదిలో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో అదే కాలేజీలో శిక్షణ పొందుతున్న ఛత్తీస్గఢ్ ఫ్లైట్ లెఫ్టినెంట్ అమరేందర్ ఆ ఐఏఎఫ్ అధికారిణి పై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన సంచలనంగా మారింది.

అయితే ఈ ఘటనపై బాధితురాలు వాయుసేన‌ అధికారులకు ఫిర్యాదు చేసింది. కానీ వాయుసేన అధికారులు తనపై అమానవీయంగా ప్రవర్తించారని బాధితురాలు ఆరోపిస్తోంది. 2 వారాల క్రితం తనపై అత్యాచారం జ‌ర‌గ్గా వాయుసేన వైద్యులు త‌న‌పై సుప్రీంకోర్టు నిషేధించిన అనుచితమైన రెండు వేళ్ల ప‌రీక్ష‌ను జ‌రిపార‌ని చెప్పింది. దాంతో తనను మరింత క్షోభకు గురి చేశారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాకుండా పోలీసులు సైతం తనను దారుణమైన ప్రశ్నలతో ఇబ్బంది పెట్టాలని బాధితురాలు ఆరోపిస్తోంది.

గతంలో లైంగిక అనుభవం ఉందా అంటూ పోలీసులు ప్రశ్నించాలని బాధితురాలు కన్నీళ్లు పెట్టుకుంది. ఇలా ఉంటే… అప్పట్లో మహిళలపై అత్యాచారం జరిన‌ట్లు ఫిర్యాదు చేస్తే అత్యాచారాన్ని నిర్ధారించడానికి వైద్యులు రెండు వేళ్ల పరీక్ష‌ను జ‌రిపేవారు. 2013 మే నెల‌లో దీన్ని అత్యంత అమానవీయ పరీక్షగా…. బాధితుల గోప్యత హక్కుకు భంగం కలిగించే చర్యగా సుప్రీంకోర్టు భావించి నిషేధించింది. అంతేకాకుండా ఇది అశాస్త్రీయమైన ప‌రీక్ష అని, అత్యాచార బాధితుల కోసం మరింత సానుకూల‌మైన ఆదునిక ప‌రీక్ష‌ల‌ను బాధితులకు అందుబాటులో ఉంచాలని సుప్రీంకోర్టు పేర్కొంది.

ఈ రెండేళ్ల ప‌రీక్ష‌ బాధితుల పై మరోసారి అత్యాచారానికి పాల్పడడంతో సమానమని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అయితే ఇప్పుడు ఆ పరీక్షను తన‌పై ప్రయోగించడంతో ఐఎఫ్ఎస్ అధికారిని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది. పోలీసులకు ఫిర్యాదు చేసినా కూడా ఈ కేసుపై పట్టించుకోవడం లేదని బాధితురాలు ఆరోపిస్తోంది. తన ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని రెండుసార్లు పోలీసులు కోరినట్టు బాధితురాలు చెబుతోంది. తాను లిఖిత‌ పూర్వకంగా గా లేఖను సమర్పించాగా… ఆ లేఖలో మార్పులు చేసి సంతకం చేయాలని పోలీసులు కోరినట్టు బాధితురాలు చెబుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news