హైద‌రాబాద్ లో దారుణం..మ‌హిళ‌పై ముగ్గురు అత్యాచారం..ఆపై..!

హైద‌రాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ మ‌హిళ త‌నపై ముగ్గురు అత్యాచారం చేశారంటూ పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని చోట బజార్ కు చెందిన ఓ మహిళ తనపై నెల రోజుల‌ క్రితం ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేసి, ఫొటోలు వీడియోలు తీసినట్లు ఫిర్యాదు చేసింది. కొనేందుకు ఇల్లు చూపిస్తామని తనను తీసుకుని వెళ్లి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సదరు మహిళ ఫిర్యాదు చేసింది.woman was tortured and molested while her father was killed

ఈ విషయాన్ని పోలీసులకు చెప్తే తనను చంపేస్తామని గన్నులు మరియు కత్తులు చూపించి బెదిరిస్తున్నట్లు మహిళ ఫిర్యాదులో పేర్కొంది. ఇక మ‌హిళ ఫిర్యాదు మేర‌కు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఓ నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు నింధితులు పరారీలో ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే హైద‌రాబాద్ న‌గ‌రంలో వ‌రుస దారుణాలు చోటు చేసుకోవ‌డం ప్ర‌జ‌ల‌ను ఆందోళ‌న‌కు గురిచేస్తోంది. కఠిన శిక్ష‌లు విధిస్తున్నా దారుణాలు చోటు చేసుకోవ‌డం పోలీసులకు త‌ల‌నొప్పిగా మారింది.