BheemlaNayak : గత్తర లేపుతున్న ”లాలా భీమ్లా” సాంగ్

-

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ – రానా ప్రధాన పాత్ర దారులుగా భీమ్లా నాయక్‌ సినిమా రూపొందుతోంది. సాగర్‌ కె చంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. పవన్‌ కళ్యాణ్‌ సరసన హీరోయిన్‌ గా నిత్యా మీనన్‌ నటిస్తుండగా… రానా సరసన సంయుక్త మీనన్‌ నటిస్తోంది.

మలయాళంలో హిట్‌ కొట్టిన అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌ కి ఇది రీమేక్‌. పవన్‌ – నిత్యామీనన్‌ కాంబినేషన్ లోని సన్నివేశాల చిత్రీకరణను పూర్తి చేశారు. ప్రస్తుతం రానా – సంయుక్త మీనన్‌ కాంబోలో సన్నివేశాలను షూట్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే… భీమ్లా నాయక్‌ సినిమా నుంచి అదిరి పోయే అప్డేట్‌ వచ్చింది. ఈ సినిమా తాజాగా మూడో సింగిల్‌ ను విడుదల చేసింది చిత్ర బృందం.

”లాలా భీమ్లా” అనే లిరిక్స్‌ తో ప్రారంభం అయ్యే మూడో సింగిల్‌ ను విడుదల చేశారు. ఇక ఈ సాంగ్‌ పూర్తి గా మాస్‌ యాంగిల్‌ ఉంది.  పవన్‌ కళ్యాణ్‌ యాక్షన్ సీన్స్‌ ఈ వీడియోలో మనకు కనిపించాయి.  ఇక ఈ పాటకు తమన్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌ అదరగొట్టాడు.  మొత్తానికి పవన్‌ కళ్యాణ్‌  ఫ్యాన్స్‌ కు లాలా సాంగ్‌ మంచి ఊపునే ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news