కమల్ అభిమానులకు పండగే.. బర్త్ డే గిఫ్టుగా ’విక్రమ్‘ మూవీ ఫస్ట్ లుక్

-

కమల్ హాసన్ అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే వార్త. లోకనాయకుడు నటిస్తున్న విక్రమ్ మూవీ ఫస్ట్ లుక్ విడులయింది. లోకేష్ కనకరాజ్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీపై అంచనాలు బాగానే ఉన్నాయి. యాక్షన్ థ్రిల్లర్ ‘విక్రమ్’ ఫస్ట్ లుక్‌కి శనివారం అపూర్వ స్పందన లభించింది, విడుదలైన నిమిషాల్లోనే 52,000 మందికి పైగా వీడియోని యూట్యూబ్‌లో లైక్ చేసారు. నవంబర్ 7 కమల్ హాసన్ 67 పుట్టిన రోజు కానుకగా ముందు రోజు చిత్ర యూనిట్ ఈ ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది. 

యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ లో కమల్ హాసన్ జైలులో తలపడుతున్న సన్నివేశాలు ఉన్నాయి. జైలు లోపల తీవ్రమైన కాల్పుల నుండి తనను తాను రక్షించుకోవడానికి కమల్ ప్రయత్నిస్తున్నట్లుగా సన్నివేశం ఉంది.

’విక్రమ్’ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించగా, గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఫిలోమిన్ రాజ్ ఎడిటింగ్ చేసిన ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్ ఎన్. సతీస్ కుమార్. నవంబర్ 7న 67వ వసంతంలోకి కమల్ అడుగుపెట్టనున్న సందర్భంగా  ‘విక్రమ్’ చిత్రబృందం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news