వచ్చే ఎన్నికల్లో బండి సంజయ్‌ ఎంపీగా గెలవడు : మాజీ మేయర్ రవిందర్ సింగ్

-

కరీంనగర్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పై మాజీ మేయర్ రవిందర్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఎంపీగా బండి సంజయ్‌ గెలవబోడని తేల్చి చెప్పారు. బండి సంజయ్ డ్రామాలు మానేయని.. భీమ్ దీక్ష అని పెట్టి అందులో ముఖ్యనేతలు పేర్లే పెట్టలేదని నిప్పులు చెరిగారు. రాజ్యాంగంలో ఒక్క ఆర్టికల్ పై మాట్లాడే ధైర్యం చేయాలని.. రాష్ట్ర అధ్యక్షుడు గా కేంద్రం నుండి ఏమి తెచ్చావు బండి సంజయ్ అని నిలదీశారు.

బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఎక్కడన్నా ఒక్కటైన సంక్షేమ పథకాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. ఎన్నికలకు ఇంకా రెండేళ్ళు ఉన్నాయి ఎవరి బలమెందో చూసుకుందామని సవాల్‌ విసిరారు. వచ్చే ఎన్నికల్లో బండి సంజయ్ గెలవడని.. దళితులకు గౌరవం ఇవ్వవు కమిటీని ఎంపిలనే పట్టించుకోవని బండి సంజయ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీక్షలు పేరుతో పబ్బం గడుపుతున్నారు బిజెపి వాళ్ళని.. బండి సంజయ్ రచ్చ కోసం చూస్తే మేము చర్చ కోసం చూస్తామని స్పష్టం చేశారు రవిందర్ సింగ్.

Read more RELATED
Recommended to you

Latest news