పల్లెటూరి పడుచు పిల్లలా హొయలు పోతున్న రాశీఖన్నా..

-

రాశీ ఖన్నా.. వెంకీ మామా, ప్రతీ రోజూ పండగే సినిమాలతో సక్సెస్ అందుకుని మళ్ళీ ట్రాక్ ఎక్కిన భామ, ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ చిత్రాల్లోనూ నటిస్తుంది. సోషల్ మీడియాలో చాలా ఆక్టివ్ గా ఉండే రాశీ ఖన్నా, తాజాగా షేర్ చేసిన ఫోటోలు చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తున్నాయి. సినిమాల్లో ఘాటు ఘాటు అందాలతో అందరినీ మత్తెక్కించే అమ్మడు, ఈ ఫోటో షూట్లో పూర్తిగా విభిన్నంగా కనిపించింది.

పల్లెటూరి గెటప్ లో లంగాఓణీలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎరుపు, ఆకుపచ్చ కాంబినేషన్లో పంటపొలాల్లో తిరిగే పడుచుపిల్లలా ఉంది. ముఖాన కుంకుమ బొట్టు, జడలో బంతిపూలు మరింత అందాన్ని తెస్తున్నాయి. చేతిలో కడవ పట్టుకుని ఎవరి కోసమో ఎదురుచూస్తున్నట్టుగా ఉంది. మరొక ఫోటోలో కొంటె చూపులో కోపం మిళితం చేస్తూ మతి పోగొట్టింది. మొత్తానికి సోషల్ మీడియాలో అభిమానులని బాగా పెంచుకుంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news