ఇంట్లో కూర్చోవడం పరిష్కారం కాదు.. ఇండస్ట్రీ నిర్ణయంపై రష్మీ ఫైర్

-

కరోనా విజృంభిస్తుండటంపై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. మార్చి 31 వరకు జన సమూహం ఎక్కువగా ఉండే ప్రదేశాలైన కాలేజీ, స్కూల్స్, మాల్స్, క్లబ్స్, పబ్స్ వంటి వాటిని మూసి వేసింది. కరోనాను  అరికట్టేందుకు ప్రజలు సహకరించాలని ప్రభుత్వం కోరింది. అందులో భాగంగానే మెగాస్టార్ చిరంజీవి స్వచ్చందంగా ముందుకు వచ్చి కేసీఆర్ నిర్ణయానికి మద్దతిచ్చాడు.
ప్రజలందరూ ప్రభుత్వ నిర్ణయానికి మద్దతివ్వాలని, తన సినిమా షూటింగ్‌ను కూడా వాయిదా వేస్తున్నానని చిరు ప్రకటించాడు. అదే విధంగా చిత్ర మండలిలోని 24 క్రాఫ్ట్స్ విభాగానికి చెందిన పెద్దలందరూ సమావేశమై ఓ నిర్ణయాన్ని తీసుకున్నారు. మార్చి 31 వరకు టాలీవుడ్‌లో ఎలాంటి షూటింగ్స్ జరగకూడదని నిర్ణయించారు. ఈ మేరకు అందరూ ఆ నిర్ణయాన్ని ఆమోదించారు.

అయితే ఈ నిర్ణయంపై ప్రముఖ యాంకర్ రష్మీ గౌతమ్ ఫైర్ అయింది.  ‘ఇండస్ట్రీ రంగానికి చెందినంత వరకు ఇంట్లోనే కూర్చోడం అనేది ఆప్షన్ కాదు.. ముందుగా అనుకున్న షెడ్యూల్స్‌ను వాయిదా వేయలేము.. అవసరమైన జాగ్రత్తలు తీసుకుని మనమంతా పనులు చేసుకోవాల’ని సూచించింది. మరి ఈమె సలహాను, సూచనను ఎవరైనా వింటారేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news