అంతకు ముందు ఏన్నో సినిమాల్లో చేసినా కూడా క్రేజ్ రాని రష్మిక కు పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగా విపరీతంగా క్రేజ్ పెరిగిపోయింది. ఇక ఆమె కోసం నిర్మాతలు దర్శకులు వెయిట్ చేసే పరిస్థితి ఏర్పడింది. ఇక సౌత్ లో అన్ని భాషల సినిమాలు చేస్తూ బిజీగా ఉంది
తన అందంతో..నటనతో సౌత్ మేకర్స్ ను ఆకర్షించిన బ్యూటీ.. ప్రస్తుతం బాలీవుడ్ ప్రాజెక్ట్స్ తో కుడేబిజీగా ఉంది. ఈ సినిమా తో వచ్చిన పేరుతో ఒక పక్క అందాల ప్రదర్శన చేస్తూనే మరో పక్క మంచి పాత్రలు వస్తే విడువకుండా ఆ సినిమాల్లో కూడా నటిస్తూ ఉంది. అలాగే గ్లామర్ పాత్రలు చేయడంలో కూడా ఎక్కడా తగ్గకుండా నటిస్తూ నే ఉంది.
ఇక రీసెంట్ గా కూడా న్యూఇయర్ స్పెషల్ గా తన ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేసింది. అలాగే తన అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది.అలాగే 2023 లో కోవిడ్ కూడా తొలగిపోయి అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా అంది. ఇక పుష్ప 2 షూటింగ్ కోసం తాను కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నా అని సమధానం ఇచ్చింది. ప్రస్తుతం అమ్మడి ఖాతాలో 4సినిమాలు ఉన్నాయి.