కన్నడ బ్యూటీ రష్మిక మందన కు ఉన్న ఫాలోయింగ్ మరి హీరోయిన్ కు లేదు. చలో సినిమాతో టాలీవుడ్ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ భామ… ప్రస్తుతం చిత్ర పరిశ్రమనే లేస్తుంది. ఇటీవల రష్మిక మందన నటించిన పుష్ప సినిమా మంచి విజయం సాధించింది. దీంతో రష్మిక మందన క్రేజ్ మరింత పెరిగింది. ఇది ఇలా ఉండగా విజయ్ దేవరకొండ, రష్మిక మందాన రిలేషన్ షిప్ లో ఉన్నట్లు మరోసారి వార్తలు అవుతున్నాయి. కొత్త సంవత్సర వేడుకల్లో భాగంగా ఇటీవల దేవరకొండ బ్రదర్స్ గోవా కి వెళ్లారు.
న్యూ ఇయర్ విషెస్ తెలుపుతూ ఇంస్టాగ్రామ్ లో పలు ఫోటోలను కూడా షేర్ చేశారు. అయితే అదే సమయంలో రష్మిక కూడా శుభాకాంక్షలు తెలుపుతూ…” హ్యాపీ న్యూ ఇయర్ మీ లవ్స్” అంటూ హార్ట్ ఏమోజీతో ఓ ఫోటో షేర్ చేసింది. రష్మిక షేర్ చేసిన పిక్ లో ఉన్న లొకేషన్… ఆనంద్ దేవరకొండ షేర్ చేసిన ఫోటో లోనిది ఒకటే కావడం విశేషం. దీంతో విజయ్ దేవరకొండ, రష్మిక మందన డేటింగ్ లో ఉన్నారంటూ వార్తలు వైరల్ గా మారాయి. కాగా మొదట్లో కన్నడ నటుడు రోహిత్ శెట్టి తో నిశ్చితార్థాన్ని రష్మిక క్యాన్సిల్ చేసుకున్న సంగతి తెలిసిందే.