ఒమీక్రాన్ బారిన పడకుండా ఉండాలంటే ఈ హెల్త్ టిప్స్ ని పాటించండి..!

-

కరోనా మహమ్మారి కారణంగా చాలా మంది తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు గురవుతూ వుంటారు. అయితే ఇప్పుడు మళ్లీ ఈ మహమ్మారి తీవ్రంగా వ్యాపిస్తోంది. ఇటువంటి సమయంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి. ఒమీక్రాన్ వైరస్ బారినపడకుండా ఇంట్లోనే ఉంటూ జాగ్రత్తగా ఉండాలి.

ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెడుతూ మంచి ఆహార పదార్థాలను తీసుకుంటూ ఆరోగ్యంగా ఉండాలి. అయితే మీరు కరోనా వైరస్ బారిన పడకుండా రోగనిరోధక శక్తిని ఎలా పెంచుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం.

విటమిన్ డి:

విటమిన్ డి ఆరోగ్యానికి అవసరం. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అలానే సరిపడా విటమిన్-డి మనకి అందాలి. ఆహారపదార్ధాలు. సన్ లైట్ తో విటమిన్ డి ని మనం పొందవచ్చు.

మంచి నిద్ర:

మంచి నిద్ర కూడా ఆరోగ్యానికి చాలా మంచి చేస్తుంది. చక్కగా ఎక్కువసేపు నిద్రపోతే రోగనిరోధక శక్తి పెరుగుతుంది అలానే నిద్రలేమి సమస్య వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి వీలైనంత ఎక్కువ సేపు నిద్రపోండి.

వ్యాయామాలు:

వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యంగా, ఫిట్ గా ఉండటానికి అవుతుంది. అలాగే ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. అలానే విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి. అలానే పసుపు, తేనే, తులసి వంటివి ఎక్కువగా వాడండి. అలానే మిరియాలు కూడా మేలు చేస్తాయి.

బ్రీతింగ్ ఎక్సర్సైజ్:

ప్రశాంతంగా ఉంటూ ఒత్తిడి లేకుండా ఆనందంగా ఉండడానికి చూసుకోండి. బ్రీతింగ్ ఎక్సర్సైజ్లని చేయడం వల్ల ఆక్సిజన్ బాగా అందుతుంది. అలానే ఇబ్బందులు ఏమి రావు. వీటన్నిటితో పాటు సరిపడా నీళ్లు తీసుకోవాలి. డీహైడ్రేషన్ కి గురవకుండా ఎక్కువగా లిక్విడ్స్ తీసుకుంటూ ఉంటే ఆరోగ్యానికి ఇబ్బందులు రావు. ఇలా ఈ జాగ్రత్తలు తీసుకుని ఆరోగ్యంగా ఉండండి.

Read more RELATED
Recommended to you

Latest news