విజయ్ దేవరకొండ తో డేటింగ్ పై క్లారిటీ ఇచ్చిన రష్మిక..!!

-

మొదటిసారి గీత గోవిందం సినిమా ద్వారా వీరిద్దరి కాంబినేషన్ మొదలైందని చెప్పవచ్చు.ఈ సినిమా తర్వాత డియర్ కామ్రేడ్ సినిమా వచ్చింది అయితే ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదని చెప్పాలి. ఇక ఇలా వీరిద్దరూ రెండుసార్లు స్క్రీన్ షేర్ చేసుకోవడంతో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారని వార్తలు బయట వైరల్ అవుతున్నాయి. అంతేకాదు రష్మిక, విజయ్ దేవరకొండ ఇద్దరు కూడా ముంబై వీధుల్లో కలిసి తిరగడం, రెస్టారెంట్లు, పార్టీలకు, ఫంక్షన్లకు అటెండ్ అవుతూ ఉండడం చూసి ఇలాంటి వార్తలకు మరింత బలం చేకూరింది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే విజయ్ దేవరకొండ ఇంట్లో జరిగే చిన్న ఫంక్షన్ అయినా సరే రష్మిక మందన్న హాజరవుతూ ఉండడం గమనార్హం. రీసెంట్ గా కాఫీ విత్ కరణ్ షో లో పాల్గొన్న విజయ్ దేవరకొండ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు రష్మిక వంతు వచ్చిందని చెప్పాలి.ఇక రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు రష్మీక. విజయ్ దేవరకొండ తో రిలేషన్షిప్ పై వస్తున్న పుకార్ల గురించి స్పందించమని రష్మిక మందన్నను అడగగా.. ఆమె మాట్లాడుతూ.. ప్రజలు మన గురించి చెత్తగా మాట్లాడగలరు. కానీ వారిని నవ్వించడానికి ఇష్టపడతానని తెలిపింది. ఇక నేను సంవత్సరం లో 5 సినిమాలు చేస్తున్నాను. కానీ మీరు ఇంకా వచ్చి నన్ను ఎవరితో డేటింగ్ చేస్తున్నారు? మీ వ్యక్తిగత జీవితం ఏమిటి ? అని అడుగుతున్నారు. నటులము మా గురించి మరింత తెలుసుకోవాలని ఆసక్తి మీకు ఉందని నేను అర్థం చేసుకోగలను.. కానీ నా కెరియర్ ఆరంభం నుండి ఇది అలాగే ఉంది..Vijay Deverakonda Calls Wedding Rumours With 'Pushpa' Star Rashmika Mandanna As 'Nonsense'

ఇప్పటికీ ఆమె ఎవరిని చూస్తోంది? లేదా ఆమె ఈ వ్యక్తితో ఉందా ?అని ఆలోచిస్తుంటారు. నటీనటులు లైన్ లైట్ లో ఉంటారు కాబట్టి మీరు దాని గురించి మాట్లాడవచ్చు కానీ నా విషయానికి వస్తే నేను నా మాటల్లో చెప్పేంతవరకు కంక్లూజన్ కి రావద్దు అంటూ రష్మిక తెలిపింది. కేవలం తన పనిపై మాత్రమే దృష్టి పెడతానని చెప్పుకొచ్చింది రష్మిక.

Read more RELATED
Recommended to you

Latest news