PUSHPA : పుష్ప నుంచి బిగ్ అప్డేట్..రేపే రష్మిక ఫస్ట్ లుక్ రిలీజ్

-

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా పుష్ప. ఆర్య, ఆర్య 2 తర్వాత ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ సినిమాగా పుష్ప మీద భారీ అంచనాలు ఉన్నాయి. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న పుష్ప సినిమాను పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.

ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రాజమండ్రి లో జరుగుతోంది. ఇందులో భాగంగానే.. ఇప్పటికే రాజమండ్రి లో జరుగుతున్న షూటింగ్ ఫోటోలు ఇటీవలే సోషల్ మీడియా లో దర్శనమిచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా నుంచి ఓ అదిరిపోయే అప్డేట్ వచ్చింది.

ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందాన నటిస్తోంది. అయితే రేపు ఈ రష్మిక మందాన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయాలని చిత్ర బృందం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యం లోనే ఓ పోస్టర్ కూడా విడుదల చేసింది చిత్ర బృందం. రేపు ఉదయం పూట 9.45 గంటలకు విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో పుష్ప ఫాన్స్ లో సందడి మొదలైంది. కాగా ఈ మూవీ పార్ట్ -1 ను ఈ ఏడాది చివర్లో అంటే డిసెంబర్ 25 వ తారుఖున అన్నీ థియేటర్ల లో విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news