ప్రభుత్వంపై పూర్తి నమ్మకం ఉంది: రేషన్ డీలర్లు

-

ఈ రోజు తెలంగాణ రేషన్ షాప్ డీలర్లు కొని డిమాండ్ లను పరిష్కరించాలని కోరుతూ సమ్మెను మొదలు పెట్టగా… రంగంలోకి దిగిన మంత్రి గంగుల కమలాకర్ రేషన్ డీలర్ల ప్రతినిధులతో సమావేశం అయ్యి వారి డిమాండ్ లను విని వారికి తగిన విధంగా చేస్తామని హామీ ఇవ్వడంతో వారు అంతా శాంతించి సమ్మెను విరమించారు. ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ రేషన్ డీలర్లు 2 .83 కోట్ల రేషన్ కార్డు దారులు ప్రయోజనమే ప్రభుత్వానికి ముఖ్యం… వారికి ఇబ్బంది కలిగించవద్దు అని వారితో మాట్లాడి ఎప్పటిలాగే విధుల్లోకి వెళ్ళడానికి ఒప్పించారు.

దీనితో రేషన్ డీలర్ల ప్రతినిధులు అంతా ఒప్పుకుని మాకు ప్రభుత్వంపై పూర్తి నమ్మకం ఉంది. మేము చెప్పిన డిమాండ్ కు వారు ఒప్పుకుంటారన్న నమ్మకంతోనే సమ్మెను విరమిస్తున్నాం అంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు రేషన్ డీలర్లు.

Read more RELATED
Recommended to you

Latest news