రావణాసుర ట్విట్టర్ రివ్యూ.. ఎలా ఉందంటే..?

-

మాస్ మహారాజా రవితేజ గత ఏడాది ధమాకా సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత ఈ ఏడాది చిరంజీవితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకొని వాల్తేర్ వీరయ్య సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇక ఇప్పుడు రావణాసుర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన టీజర్ , ట్రైలర్, పాటలు అన్నీ కూడా భారీ అంచనాలను పెంచేసాయి. సినిమా నేడు థియేటర్లలోకి కూడా వచ్చింది. మరి ఈ సినిమా మీద నెటిజన్లో ఏమంటున్నారు? ట్విట్టర్ రివ్యూ ఎలా ఉంది ?అనేది ఇప్పుడు చూద్దాం..

ట్విట్టర్ రివ్యూ విషయానికి వస్తే.. అన్న ఇలాంటి సినిమాలు మళ్లీ చేయకు.. ఖిలాడి, నిప్పు సినిమాల లాగే అనిపిస్తోంది. ఖిలాడీ కాస్త బెటర్ అన్న.. నీకు ఫెయిల్యూర్ సినిమాలు రావద్దని మేము అనుకుంటున్నాము.. కానీ నువ్వు డిజాస్టర్ సినిమాలు తీస్తావు అని ఒక అభిమానిగా ఆవేదన చెందుతున్నాను. అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. అయితే మరొక అభిమాని సినిమా అదిరిపోయిందని కామెంట్లు చేయగా మరొక అభిమాని విలన్ రోల్లో అదరగొట్టేసాడని వన్ మాన్ షో అని అంటున్నారు.

మొత్తానికి అయితే ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంటుందని చెప్పాలి. ఇకపోతే ఇప్పుడు ఎలాగో సినిమా థియేటర్లలో ప్రారంభం అయింది కాబట్టి మొదటి షో పూర్తయిన తర్వాత ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందో చూడాలి. ఇకపోతే ఒకవేళ ప్రేక్షకులను మెప్పించినట్లయితే రవితేజ ఖాతా లో హ్యాట్రిక్ హిట్ పడినట్టే. మరి ఈ సినిమాతో ఆయన నిజంగా ప్రేక్షకుల మన్ననలు పొందుతాడా? లేదా అన్నది సినిమా రిజల్ట్ ని బట్టి ఉంటుందని చెప్పవచ్చు. ఇకపోతే రెండు రోజులు ఆగితే సినిమా సక్సెస్ అవుతుందా లేదా అన్నది తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news