నెల్లూరు: నలుగురు ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు… వివరణ ఇవ్వకుంటే చర్యలు !

-

ఆంధ్రప్రదేశ్ లో సచివాలయం వ్యవస్థ ద్వారా దాదాపు 5 లక్షల ఉద్యోగాలను ప్రభుత్వం సృష్టించింది. దీని ద్వారా డిగ్రీ చదువుకుని ఖాళీగా ఉన్న ఎందరో ఉద్యోగం సాధించి సంతోషంగా ఉన్నారు. అయితే వీరిలో కొందరికి ఉద్యోగం ఉంటే ఒక బాధ్యత అని, ప్రజలకు సేవ చేయడంలో మన పాత్ర చాలా ముఖ్యం అని మరిచిపోయినట్లు ఉన్నారు. వర్కింగ్ హౌర్స్ లో విధులకు హజరవ్వకుండా పట్టుబడ్డారు.

ఇపుడు వీరికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు, నెల్లూరు కార్పొరేషన్ కు చెందిన నలుగురు సచివాలయం ఉద్యోగులు జాయింట్ కలెక్టర్ కూర్మనాథ్ తనిఖీలకు వెళ్ళగా, ఆ సమయంలో నాలుగు ఉద్యోగులు విధుల్లో లేరు. వీరిలో డి భాస్కర్, ఎం విశ్వేశ్వరరావు, ఎ అశోక్ మరియు టీ శోభన లు ఉన్నారు. ఈ విషయం డిప్యూటీ కమిషనర్ చెన్నుడు వద్దకు వెళ్ళగా…వెంటనే వీరి నలుగురికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వారిపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో తగిన వివరణ ఇవ్వాలని కోరారు. మరి వీరి సరైన వివరణ ఇవ్వకుంటే కటిన చర్యలు తప్పేలా లేవు.

Read more RELATED
Recommended to you

Latest news