టాలీవుడ్ నటుడు, బిజెపి ఎంపీ రవి కిషన్ ఇంట్లో విషాదం నెలకొంది. రవి కిషన్ సోదరుడు రామకిషన్ శుక్లా గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషయాన్ని రవి కిషన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ముంబైలోని నానాపతి ఆసుపత్రిలో ఆయన మరణించినట్లు పేర్కొన్నారు.
రామ్ కిషన్ శుక్లా మృతిపై పలువురు నటీనటులు సంతాపం ప్రకటించారు. రామ్ కిషన్ శుక్లా ముంబైలో ఉంటూ రవికిషన్ ప్రొడక్షన్ పనులు చూసుకునేవారు. కాగా, బిజెపి ఎంపీ రవి కిషన్… అల్లు అర్జున్ నటించిన రేసు గుర్రం సినిమాతో బాగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే.