రవితేజ డిస్కో రాజా మూవీ రివ్యూ
విడుదల తేదీ : జనవరి 24, 2020
Manalokam రేటింగ్ : 2.75/5
నటీనటులు : రవితేజ
దర్శకత్వం : ఆనంద్
కథ
సైన్స్ లాబ్ లో జరిగిన ఒక ప్రయోగం మూలంగా బ్రైన్ డెడ్ ఐనా వ్యక్తి వాసు ( రవితేజ) మళ్ళీ బతుకుతాడు .. అయితే అతని బుర్రలో ఉన్న ఆలోచనలు అన్నీ కోల్పోయి ఉంటాడు. అతని కుటుంబాన్ని , అతని గతాన్నీ తెలుసుకోవడం కోసం ఒక ఎంపీ తో గొడవ పెట్టుకుంటాడు. అతని కుటుంబం గురించి తెలుసుకునే క్రమం లో – సేతు ( బాబీ సింహా ) గురించి కూడా తెలుసుకుంటాడు. ఇంతకీ సేతు కీ వాసు కీ సంబంధం ఏంటి , వాసు తన గతం మళ్ళీ గుర్తు తెచ్చుకున్నాడా .. మధ్యలో ఈ డిస్కో రాజా ఎవరు .. ఇలా రకరకాల ట్విస్ట్ ల మధ్య కథ సాగుతుంది.
ప్లస్ పాయింట్స్
డిస్కో రాజా గా రవితేజ పెర్ఫార్మెంస్ సినిమా కి అతిపెద్ద బలం అని చెప్పాలి. తనదైన శైలి లో స్క్రీన్ మీద అద్భుతాలు చెయ్యగల రవితేజ తన ఎనర్జీ మొత్తం మళ్ళీ చూపించాడు. సేతు పాత్ర చేసిన బాబీ సింహా నటన గొప్పగా ఉంది. ఇంటర్వల్ కి ముందర ఒక 20 నిమిషాలు , ఇంటెర్వెల్ తరవాత 30 నిమిషాలు సినిమా చాలా స్ట్రాంగ్ గా నడుస్తుంది. తమన్ ఇచ్చిన నేపధ్య సంగీతం ఇరగదీసింది అనే చెప్పాలి. పాటలు కూడా థియేటర్ లో బాగున్నాయి. బాబీ సింహా ని హీరో ఇరకాటం లో పెట్టె ఎపిసోడ్ కి థియేటర్ లో విజిల్స్ పడ్డాయి.
మైనస్ పాయింట్స్
రొటీన్ గా ఉండే స్టోరీ ఈ సినిమా కి పెద్ద మైనస్ , ఆ రొటీన్ కథ ని కూడా కొన్ని ఎపిసోడ్ లు తప్ప మిగితా అంతా బోరింగ్ గా నడిపేశాడు డైరెక్టర్. సెకండ్ హాఫ్ చాలా వీక్ గా అనిపిస్తుంది. కామెడీ కి అలవాటు పడిన తెలుగు ప్రేక్షకులకి బోర్ తెప్పించే కామెడీ ఉంది. విలనిజం అసలు లేదు అనే చెప్పాలి .. మంచి కాన్సెప్ట్ ని డైరెక్టర్ vi ఆనంద్ వేస్ట్ చేసుకున్నాడు అనిపించింది.
సాంకేతిక విభాగం
తమన్ ఇచ్చిన మ్యూజిక్ బాగుంది, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లో ఎవ్వరూ తనని బీట్ చేయలేరు అని తమన్ మళ్ళీ నిరూపించుకున్నాడు. కెమెరా పనితనం చెప్పుకోతగ్గగా ఏమీ లేదు. ఎడిటింగ్ విషయం లో కాస్త జాగ్రత్త తీసుకుని ఉండాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
తీర్పు
సంక్రాంతి సినిమా లు ఒక రేంజ్ లో ఆడేస్తున్న వేళలో .. డిస్కో రాజా చాలా భారీ గా ఆడితే గానీ బ్రేక్ ఈవెన్ అవాడు. విపరీతమైన పాజిటివిటీ ఏమీ లేని ఈ సినిమా రెగ్యులర్ రివెంజ్ డ్రామా ని తలపిస్తుంది. దానికి ల్యాబ్ ప్రయోగం అంటూ సుగర్ కోట్ వేసే ప్రయత్నం చేశాడు డైరెక్టర్. రవితేజ ఎనర్జీ నే ఈ సినిమా ని కాపాడాలి .