కొత్త ప్రాజెక్టు స్టార్ట్ చేసిన ర‌వితేజ‌.. అదిరిన మోష‌న్ పోస్ట‌ర్‌!

-

ఎవ‌రి స‌పోర్టు లేకుండా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోగా ఎదిగాడు ర‌వితేజ‌ Ravi Teja. ఆయ‌న త‌న న‌ట‌న‌తో కోట్లాదిమంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు. రొటీన్‌కు భిన్నంగా ఉండే విధంగా చూసుకుంటారు ఆయ‌న సినిమాల‌ను. అయితే ఎన్నో ప్లాపులు ఆయ‌న్ను చుట్టుముట్టినా తాను మాత్రం ఎక్క‌డా వెర‌వ‌కుండా మ‌ళ్లీ స‌క్సెస్ దారుల‌ను వెతుకుతూనే ఉన్నారు. ఇక రీసెంట్‌గా క్రాక్ మూవీతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టాడు.

ర‌వితేజ‌/ Ravi Teja
ర‌వితేజ‌/ Ravi Teja

ఇక ఇదే ఎనర్టీతో ప్ర‌స్తుతం ఖిలాడీ మూవీలో న‌టిస్తున్న మాస్ మ‌హారాజ్‌.. ఇప్పుడు క‌రోనాతో కాస్త బ్రేక్ తీసుకున్నాడు. అయితే ఈ టైమ్ లోనే మ‌రో ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టాడు. అదే ఆర్‌టీ 68అనే కొత్త మూవీ. ప్ర‌స్తుతం ఈ మూవీ ర‌వితేజ‌కు 68వ సినిమా.

శ‌ర‌త్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న మూవీ షూటింగ్‌ను స్టార్ట్ చేస్తున్న మూవీ మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. ఇందుకోసం మోష‌న్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు మేక‌ర్స్‌. ఆ పోస్ట‌ర్ చూస్తంటే కోర్టు నేప‌థ్యంలో న‌డిచే క‌థ‌లాగా తెలుస్తోంది. ఇటీవ‌ల అంద‌రూ లాయ‌ర్ల పాత్ర‌ల్లో న‌టిస్తుండ‌గా.. ఇప్పుడు ర‌వితేజ కూడా ఇదే పంతాలో న‌డుస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఆయ‌న కూడా లాయ‌ర్ గా క‌నిపించే అవ‌కాశం ఉంది. దీనికి ఇంకా టైటిల్ ఫిక్స్ చేయ‌లేదు.

Read more RELATED
Recommended to you

Latest news