రిరిలీజ్ కు రెడీ అవుతున్న రవితేజ సూపర్ హిట్ మూవీ

-

ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్‌ నటుల బ్లాక్‌బస్టర్‌ సినిమాలను మళ్లీ రిలీజ్ చేయడం ట్రెండ్‌గా మారింది. ప్రముఖ నటుడి బ్లాక్ బస్టర్ మూవీ రీ రిలీజ్ కు సిద్ధమవుతోంది. మాస్ మహారాజా రవితేజ నటించిన సినిమాల్లో విక్రమార్కుడు ఏ రేంజ్ లో హిట్ అయిందో మనందరికీ తెలిసిందే .మాస్టర్ స్టోరీటెల్లర్ ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామా జులై 27 న తిరిగి విడుదల చేయబడుతుంది. దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. విక్రమ్‌సింగ్‌ రాథోడ్‌, అత్తిలి సత్తిబాబు రెండు విభిన్న క్యారెక్టర్‌లలో రవితేజ నటన ప్రేక్షకులను అలరించాడు .

బ్రహ్మానందం, రాజీవ్ కనకాల, అజయ్, వినీత్ కుమార్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో గార్జియస్ బ్యూటీ రవితేజకు జోడీగా అనుష్క హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రానికి సంగీతాన్ని ఎంఎం కీరవాణి అందించారు.

Read more RELATED
Recommended to you

Latest news