వన్ డే వరల్డ్ కప్ 2023 ఇప్పుడు ఇండియాలో జరగనుంది, ఇప్పటికే అన్ని జట్లు ఇండియా చేరుకొని వ్యూహాలతో మమేకం అయి ఉన్నాయి. ఇక స్వదేశంలో వరల్డ్ కప్ జరగనుండడంతో మనకు కప్ గెలవడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం గత కొన్ని రోజూకుగా ఆసియా కప్ లో గాయపడిన అక్షర్ పటేల్ ఇక వరల్డ్ కప్ సమయానికి కోలుకోడని భావించిన బీసీసీఐ అతనికి బదులుగా మరో స్పిన్నర్ ను వరల్డ్ కప్ స్క్వాడ్ లో జతచేసింది. ఆస్ట్రేలియా టూర్ లో ఆడిన సీనియర్ స్పిన్నర్ రవించంద్రన్ అశ్విన్ ను మరో స్పిన్నర్ గా జట్టులోకి తీసుకుంది. ఈ వార్తతో అందరూ షాక్ అయ్యారు.. దాదాపు చాలా కాలం తర్వాత మొన్ననే ఆస్ట్రేలియా తో వన్ డే సిరీస్ ను ఆడిన అశ్విన్ కు జాక్ పాట్ లాగా రావడంతోనే వరల్డ్ కప్ లో బెర్త్ దక్కింది.
కాగా నేడే వరల్డ్ కప్ టీం లను ఐసీసీ కి పంపించడానికి ఆఖరి తేదీ కావడంతో నిన్నటి వరకు అక్షర్ పటేల్ ఏమైనా కోలుకుంటాడా అని చూసి.. చివరికి అతనికి బదులుగా అశ్విన్ ను తీసుకుంది.