ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా సంచలనం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు రవీంద్ర జడేజా గుడ్ బై చెప్పినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్ 2022 సీజన్ లో జట్టు సారాధ్య బాధ్యతలు అందుకున్న జడేజా తడబడ్డాడు.
కెప్టెన్సీ అనుభవం లేక తీవ్ర ఒత్తిడికి గురైన వ్యక్తిగతంగా కూడా ఘోరంగా విఫలమయ్యాడు. బౌలింగ్ అలాగే బ్యాటింగ్ తో పాటు చివరకు ఫీల్డింగ్ లోను రాణించలేకపోయాడు. దీంతో కేపిఎంసి బాధితులు మళ్లీ ధోనికి అప్పగించాడు.
ఇదే తాజాగా తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ కు చెందిన పోస్టులన్నీ డిలీట్ చేశారు. ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారింది. చెన్నైతో తెగ దింపులు చేసుకున్నాడు కాబట్టి ఆ జట్టుకు సంబంధించిన పోస్టులు డిలీట్ చేశాడని వాదన తెరపైకి వచ్చింది. దీంతో వచ్చే సీజన్ లో జడేజా చెన్నైకి ఆడటం కష్టమేనని అభిప్రాయం వ్యక్తం అవుతుంది. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.