100 కోట్లకు టార్గెట్ పెట్టుకున్న రవితేజ ధమాకా.!

-

రవితేజ హీరోగా, యంగ్ హీరోయిన్ శ్రీలీల నటించిన చిత్రం ధమాకా,నక్కిన త్రినాధరావు డైరెక్షన్లో యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ విడుదల అయిన తర్వాత మంచి వసూళ్లు సాధిస్తోంది. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ రూపొందిన ఈ సినిమా కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది. రవితేజ ఎంతో మంది యంగ్ డైరెక్టర్ లకు అవకాశం ఇచ్చాడు. ఇన్ని రోజులకు తాను నమ్మిన సిద్ధాంతం అతనికి ధమాకా సినిమా రూపంలో రికార్డ్ విజయం అందేలా చేసింది.

రీసెంట్ గా తన ధమాకా సినిమా వీకెండ్ లో కూడా భారీ వసూళ్లు రాబట్టింది.. వీకెండ్ లోనే 30 కోట్లు క్రాస్ రాబట్టింది.. దీంతో ఈ సినిమా రవితేజ కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అని అందరు భావించారు.అనుకున్న విధంగానే ఈ సినిమా మాస్ రాజా కెరీర్ లో భారీ కలెక్షన్స్ రాబడుతూ దూసుకు పోతుంది.

ఇక ఈ రోజుతో ధమాకా సినిమా 56 కోట్ల రూపాయల వసూళ్లు సాధించి నట్టు అధికారిక ప్రకటన వచ్చింది. ఇక రాబోయే రోజుల్లో పెద్ద సినిమాలు ఏవి లేవు కనుక ఈ సినిమా 100 కోట్లకు చేరుకున్నా కూడా ఏ మాత్రం ఆశ్చర్యం లేదని ట్రేడ్ పండితులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇది విన్న రవితేజ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. రాబోయే రోజుల్లో రవితేజ మిడిల్ హీరో నుండి టాప్ లెవెల్ హీరోల ప్లేస్ కు వెళ్లేలా ఉన్నాడని అంటున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news