రానున్న అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా షామీర్ పేట్ లియోనియా రిసార్ట్స్ లో బిజెపి నేత బిఎల్ సంతోష్ ఆధ్వర్యంలో ఆ పార్టీ కీలక నేతలు సమావేశం అయ్యారు. ఈ భేటీకి రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ సహా తెలంగాణ బిజెపి ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రతి నియోజకవర్గానికి కన్వీనర్లు, పాలక్, విస్తారక్, ప్రబారిలా నియమించారు. నియోజకవర్గాలలోని పని విధానం పై బిఎల్ సంతోష్ నేతలకు దిశానిర్దేశం చేశారు.
ఈ సమావేశం అనంతరం రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బిజెపి అధికారంలోకి రాబోతుందని.. 90 స్థానాలలో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ తల్లికి ద్రోహం చేసిన సీఎం కేసీఆర్ బిఆర్ఎస్ పేరుతో హడావిడి చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలోని వనరులను కేసీఆర్ ఫ్యామిలీ దోచుకుందని విమర్శించారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని.. కెసిఆర్ ప్రభుత్వం పై ప్రజలకు నమ్మకం పోయిందన్నారు.