ఆరోగ్యశ్రీని మూసివేయాలని ప్రయత్నిస్తే ఊరుకునేది లేదు – వైఎస్ షర్మిల

-

సీఎం కేసీఆర్ పై మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. వైయస్సార్ సృష్టించిన ఆరోగ్యశ్రీ గొప్ప పథకం అని.. పేదలకు ఏ రోగం వచ్చినా కార్పొరేషన్ స్థాయిలో వైద్యం అందించాలని ఈ పథకాన్ని ప్రవేశ పెట్టారన్నారు. ఆరోగ్యశ్రీని మూసివేయాలని ప్రయత్నిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు వైయస్ షర్మిల.

“ఆరోగ్యశ్రీ మహానేత వైఎస్ఆర్ సృష్టించిన గొప్ప పథకం. పేదలకు ఏ రోగమొచ్చినా కార్పొరేట్ స్థాయిలో ఉచిత వైద్యం అందించాలని ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. దీని ద్వారా లక్షల మంది ఉచితంగా వైద్యం, ఆపరేషన్లు చేయించుకున్నారు. కానీ KCR అధికారంలోకి వచ్చాక ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశాడు. ఈ పథకానికి నిధులు ఇవ్వకుండా, పేదలకు కార్పొరేట్ వైద్యం అందించకుండా కుట్ర చేస్తున్నాడు. ఇప్పటికే గ్రామస్థాయిలో పేదలకు ఉచిత వైద్యం, మందులు అందించే 104 అంబులెన్స్ లను మూసేశారు.

ఇప్పుడు ఆరోగ్యశ్రీకి ఎసరు పెడుతున్నాడు. నీకు జ్వరం వేస్తే యశోద..కంటికి నొప్పి వస్తే ఢిల్లీకి.. పోతావ్! పేదలు మాత్రం కార్పొరేట్ ఆసుపత్రులకు పోవద్దా? నీ పార్టీ అకౌంట్లో వేల కోట్లు ఉంటయ్.. కమీషన్ల కాళేశ్వరానికి లక్షల కోట్లు ఉంటయ్.. BRS ఆఫీసు కట్టుకోడానికి వేల కోట్ల పైసల్ ఉంటయ్.. పేదల వైద్యానికి 800కోట్లు లేవా దొర? ఆరోగ్యశ్రీని మూసివేయాలని ప్రయత్నిస్తే ఊరుకునేది లేదు. ఖబడ్దార్..!” అని సోషల్ మీడియా వేదికగా హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news