GOOD NEWS: రూ. 2 వేల నోట్లపై గడువు పెంపు !

-

గతంలో బీజేపీ ప్రభుత్వం చేసిన కొన్ని ఆర్ధిక సంస్కరణలలో చిన్న నోట్లను రద్దు చేసి పెద్ద నోట్లను తీసుకురావడం.. అందులో అంతకు ముందు అమలులో ఉన్న రూ. వెయ్యి నోటును రద్దు చేసి రూ. 2 వేల నోటును తీసుకువచ్చారు. ఈ నోటు రావడం వలన బడా వ్యాపారవేత్తలు మరియు రాజకీయ నాయకులు లాభపడ్డారేమో కానీ.. సామాన్యులు చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. కొంతకాలం తర్వాత రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా మరొక నిర్ణయాన్ని తీసుకుంది.. అమలులో ఉన్న రూ. 2 వేల నోటును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ప్రజల దగ్గర ఉన్న నోట్లను తిరిగి బ్యాంకు లలో మార్చుకోవడానికి సమయంగా ఈ రోజుటి వరకు ఇవ్వడం జరిగింది. కానీ మళ్ళీ ఈ విషయంలో రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా మరొక వారం రోజులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. సామాన్యులు దగ్గర ఉన్న నోట్లన్నీ బ్యాంకు లకు వెళ్లిపోయాయి.

ఇంకా ఎవరి దగ్గర ఉన్నాయని RBI గమనించి ఈ పొడిగింపును ఇచ్చిందన్నది వారికే తెలియాలి. కాగా ఈ వార్త కేవలం కొంతమందికి మాతృహమే గుడ్ న్యూస్ అని చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Latest news