రాధేశ్యామ్ నిర్మాతల ఔదార్యం.. కోవిడ్ సెంటర్ గా హాస్పిటల్ సెట్.

ప్రభాస్ హీరోగా రాధాక్రిష్ణ కుమార్ దర్శకత్వంలో రాధేశ్యామ్ పేరుతో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. చిత్రీకరణ దాదాపుగా చివరికి వచ్చేసింది. కరోనా కారణంగా ప్రస్తుతం చిత్రీకరణకి బ్రేక్ పడింది. ఐతే రాధేశ్యామ్ సినిమా కోసం హాస్పిటల్ సెట్ ని హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ సెట్ కోవిడ్ సెంటర్ గా మారింది. అవును, రాధేశ్యామ్ నిర్మాతలు, ఆ హాస్పిటల్ లో ని బెడ్లు, ఆక్సిజన్ సిలిండర్లు మొదలైన వాటన్నింటినీ కోవిడ్ పేషెంట్ల కోసం ఇచ్చేసారు.

కోవిడ్ తో బాధపడుతూ బెడ్లు లేక ఆక్సిజన్ సిలిండర్లు లేక ఇబ్బందులు పడుతున్న ప్రజల కోసం తమ సెట్లోని మొత్తం సామగ్రిని ఇచ్చేసారు. భారతదేశంలో కరోనా వీరవిహారం చేస్తుంది. ప్రస్తుతానికి దేశంలోని చాలా రాష్ట్రాలు పూర్తి లాక్డౌన్ దిశగానో, పాక్షిక లాక్డౌన్ దిశగానో వెళ్లాయి. ఒక్క తెలంగాణలో మాత్రమే కేవలం నైట్ కర్ఫ్యూ ఉంది.