ఇంటర్‌ ఫెయిల్ అయిన వారికి అలర్ట్..రేపటి నుంచి రీ కౌంటింగ్

-

తెలంగాణలో ఇంటర్‌ ఫెయిల్ అయిన వారికి అలర్ట్. రేపటి నుంచి రీ కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు కీలక ప్రకటన చేశారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. రేపటి నుంచి రీ కౌంటింగ్, రీ వ్యాల్యుయేషన్ కి అవకాశం.. ఈనెల 16 వరకు ఫీజు కట్టేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ రోజు సాయంత్రం నుండి కలర్ మెమోలు డౌన్ లోడ్ చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలిపారు.

అమ్మాయిలు 68.85 శాతం పాస్ అయ్యారన్నారు. అబ్బాయిలు 56.80 శాతం మంది పాస్ అయ్యారని చెప్పారు. సెకండియర్ లో 67.26 శాతం పాస్.. సెకండియర్ లో అమ్మాయిలు 73.46 శాతం పాస్… అబ్బాయిలు 60.66 శాతం పాస్ అయినట్లు పేర్కొన్నారు సబితా. జూన్ నాలుగు నుండి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయని చెప్పారు సబిత ఇంద్రా రెడ్డి. పిల్లల పై తల్లి దండ్రులు ఒత్తిడి చేయకండని… మొదటి ,ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో చివరి స్థానం లో మెదక్ ఉందన్నారు. మొదటి స్థానంలో ములుగు ఉందని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news