విశాఖ హెచ్‌పీసీఎల్‌కు ప్రపంచంలోనే అతి భారీ రియాక్టర్.. ప్రవేశపెట్టేందుకు స్పెషల్ ఆపరేషన్ !

-

విశాఖపట్నంలోని హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌(హెచ్‌పీసీఎల్‌)కు చెందిన విశాఖ్‌ రిఫైనరీ ఆధునికీకరణ కోసం ప్రపంచంలోనే అతి భారీ రియాక్టర్‌ ను ప్రవేశ పెట్టనున్నారు. ఈ రియాక్టర్‌ పొడవు 71.5 మీటర్లు, వెడల్పు 12.2 మీటర్లు, ఎత్తు 7.74 మీటర్లు. బరువు 2200 టన్నులు. దీన్ని ప్రపంచంలోనే అతి పెద్ద రియాక్టర్ అని చెబుతున్నారు. ఈ రియాక్టర్ ను షిప్‌యార్డు జెట్టీ నుంచి సింధియా సిగ్నల్, ఐఓసీ టెర్మినల్‌ రోడ్డు మీదుగా ప్రాజెక్టులోకి తరలించనున్నారు.

అందుకోసం 32 ఇరుసులతో కూడిన భారీ ట్రాలర్‌ను వినియోగిస్తున్నారు. ఒక్కో ఇరుసుకి మూడు ట్రాక్‌ లుగా ఉండగా, ఒక్కో ట్రాక్‌కి రెండు జతల్లో 8 చక్రాల చొప్పున ఒక్కో ఇరుసుకు 24 చక్రాలు ఉన్నాయి. మొత్తం 768 చక్రాలు బిగించిన ఏక ట్రాలర్‌పై తరలించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం ట్రాఫిక్ అలాగే పవర్ సప్లై కూడా నిలిపివేసి ఒక హైడ్రాలిక్ క్రేన్ ద్వారా దీనిని తరలిస్తున్నారు. దీని కోసం ఒక స్పెషల్ ఆపరేషన్ డిజైన్ చేశారు. 

Read more RELATED
Recommended to you

Latest news