రియల్ హీరో ఈ టీచర్.. ఎలిఫెంట్స్ కోసం ఏం చేశాడంటే?

-

అడవుల విస్తీర్ణం రోజురోజుకూ తగ్గిపోతున్న నేపథ్యంలో అరుదైన యానిమల్స్ అంతరించిపోతున్నాయి. ఈ క్రమంలోనే జంతువుల రక్షణకు ప్రభుత్వాలు పలు చర్యలు తీసుకుంటున్నాయి. కాగా, అడవిలో ఉండే అతిపెద్ద క్షీరదమైన ఏనుగు ఓన్లీ ఆకులు, అలం తింటూ జీవనం సాగిస్తుంటుంది. ఈ క్రమంలోనే పెద్దలు ‘బీ వెజ్ బీ స్ట్రాంగ్’ అని చెప్తుండటం మనం చూడొచ్చు. కాగా, ఏనుగులు సంచరించే ప్లేసెస్‌లో కొందరు హైపవర్ ఎలక్ట్రిక్ తీగలు ఏర్పాటు చేయడం వల్ల వాటిని తాకి అవి చనిపోతున్నాయి. ఇక కొందరు ఏనుగు దంతాల కోసం వాటిని వేటాడి మరీ చంపుతున్నారు.

ఈ క్రమంలో ఏనుగులు చనిపోతున్నాయి. ఈ విషయాలను గ్రహించిన పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఎస్పీ పాండే అనే స్కూల్ టీచర్ ఏనుగులకు సాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఏనుగులు ఎక్కువగా కనిపించే ఐదు కారిడార్లలో ఘర్షణ వాతావరణాన్ని తగ్గించే దిశగా వర్క్‌షాప్‌లను నిర్వహించడం షురూ చేశాడు. అలా రియల్ హీరోగా మారిన ఈ టీచర్‌పై ప్రస్తుతం పర్యావరణ ప్రేమికులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. జల్‌పైగురి జిల్లాలోని మల్‌బజార్‌కు చెందిన 43ఏళ్ల ఎస్పీ పాండే ఏనుగుల ప్రాణాలను కాపాడేందుకు తన వంతు ప్రయత్నం చేయడం అభినందనీయమని మెచ్చుకుంటున్నారు. ఆయన చేస్తున్న కృషికి మెచ్చి వైల్డ్‌లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ‘గ్రీన్ కారిడార్ ఛాంపియన్’ టైటిల్‌తో సత్కరించింది.

తాను పనిచేస్తున్న ప్రాంతంలో దాదాపు 500 ఏనుగులు ఉన్నట్లు తెలుసుకున్న పాండే ఆ తర్వాత అపాల్‌చంద్-మహానంద, గోరుమారా-అపాల్‌చంద్, అపాల్‌చంద్-కాలింపాంగ్, అపాల్‌చంద్-కాలింపాంగ్, చప్రమారి-కాలింపాంగ్ వంటి ఐదు కారిడార్లలో ఏనుగులు ఎక్కువగా తిరుగుతున్నాయని తెలుసుకున్నాడు. ఆ ప్లేసెస్‌లో ఏనుగులు వైర్లు తాకి మరణించకుండా ఉండేందుకుగాను స్థానికులతో మాట్లాడారు. హై పవర్ ఎలక్ట్రిక్ వైర్స్ ఏర్పాటు చేయబోయే ముందర ఏనుగులకు జరిగే నష్టం గురించి వారికి వివరించి వారిని ఒప్పించి ప్లేసెస్ మార్పించే ప్రయత్నం చేశాడు పాండే. ఈ క్రమంలోనే ఏనుగుల కోసం రక్షణ చర్యలు చేపట్టడం షురూ చేశాడు. తద్వారా వాటి మరణాలు 50 శాతం తగ్గించొచ్చిని స్థానికులకు అవగాహన కల్పించాడు. ముళ్ల కంచె ప్రమాదాలతో పాటు ఏనుగులు రైల్వే ట్రాక్‌లను దాటుతూ చనిపోతున్నాయని తెలుసుకున్న పాండే ఆ సమస్యలు అరికట్టడానికి అందరూ కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఏనుగులు, మనుషులు ప్రశాంతంగా సహజీవనం చేయడానికి వీలుగా సున్నితమైన చర్యలు చేపట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన పేర్కొన్నాడు. స్కూల్ టీచర్ చేస్తున్న ఈ పనులు చూసి స్థానికులు కూడా మెచ్చుకుంటుండటం విశేషం.

Read more RELATED
Recommended to you

Latest news