తిరుమలలో ఇవాళ రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం వచ్చింది. హుండి ద్వారా భక్తులు 2.34 కోట్ల రూపాయలు సమర్పించినట్టు పరకామణిలో తేలింది. కరోనా కలకలం వలన శ్రీవారి ఆలయానికి భక్తులని నిలిపివేశారు. దాదాపు నెలల తరువాత మళ్ళీ ఓపెన్ చేశారు. అలా ఓపెన్ చేసినా చాలా పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతిస్తున్నారు.
ఇక శ్రీవారి ఆలయంలో దర్శనాలు పునరుద్ధరణ చేసిన తరువాత ఇదే అత్యధిక ఆదాయం అని చెబుతున్నారు. ఇక దర్శనాల విషయంలో కూడా నిన్న రికార్డు సృష్టించిందని చెప్పచ్చు. ఎందుకంటే నిన్న రికార్డు స్థాయిలో శ్రీవారిని 18296 భక్తులు దర్శించుకున్నారు. భక్తుల సంఖ్య పెరగడంతో శ్రీవారి హుండీ ఆదాయం కూడా అనూహ్యంగా పెరిగింది. గత ఆరు నెల్లలో నేడు వచ్చిన ఆదాయమే అత్యధికం. ఇక కళ్యాణోత్సవాల విషయం లో కూడా భారీ డిమాండ్ నెలకొంది. ఆన్ లైన్ కల్యాణోత్సవం టికెట్లు ప్రవేశ పెట్టడంతో భారీగా డిమాండ్ నెలకొంది.